MSD – Harbhajan Singh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ లు భారత క్రికెట్ జట్టు కోసం అనేక చిరస్మరణీయ క్షణాలను గుర్తుపెట్టుకొనేలా చేసారు. ఈ ఇద్దరు లెజెండ్స్ చాలా కాలం పాటు కలిసి ఆడారు. వీరిద్దరూ కలిసి 2007 టి20 ప్రపంచకప్‌ను, 2011లో కలిసి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచిన టీంలో ఉన్నారు. అయితే, గత 10 ఏళ్లుగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఫోన్‌లో మాట్లాడలేదని హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇక ఐపీఎల్ సమయంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌లో కలిసి ఆడుతున్నప్పుడు వారు మైదానంలో మాత్రమే మాట్లాడుకునేవారని కూడా భజ్జీ చెప్పాడు.
Also Read: Indian Navy Day : ఇండియన్ నేవీ డే ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి..?
భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఓ పోడ్‌కాస్ట్‌లో ధోని గురించి చాలా విషయాలు వెల్లడించాడు. తాను ఆశిష్ నెహ్రా, యువీతో ఎక్కువగా మాట్లాడతానని అన్నాడు. దీని తర్వాత హోస్ట్ వెంటనే అతను ధోనీతో మాట్లాడడా అని అడిగాడు. ఈ ప్రశ్నపై భజ్జీ వెంటనే.. ‘లేదు.. ధోనీతో మాట్లాడనని అన్నాడు’. దీని తర్వాత అతను ధోనీతో మాట్లాడి ఎంత సమయం గడిచిపోయింది అని అడగ్గా.. ‘మేము ఐపీఎల్లో ఆడినప్పుడు మాత్రమే మాట్లాడాము. కానీ, అప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడింది లేదు. మేము పదేళ్లుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం లేదని ఆయన అన్నారు. మాజీ కెప్టెన్ ధోనీతో మాట్లాడకపోవడానికి గల కారణాన్ని అడిగినప్పుడు, హర్భజన్ సమాధానమిస్తూ.. నాకు ఎటువంటి కారణం లేదు. బహుశా అతనికి ఏదైనా కారణం ఉండవచ్చు. నాకు తెలియదు, ఒకవేళ ఎంఎస్ ధోని కూడా ఏదైనా కారణం కలిగి ఉంటే.. అతను చెప్పేవాడని తెలిపాడు.
Also Read: Hebah Patel: పింక్ చీరలో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్