2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్.. ఈ సినిమా విడుదలై 3 నెలలు అయిన సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.. ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై 300 కోట్లను అందుకుంది.. ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సినిమా అక్కడ కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు టీవిల్లోకి కూడా రాబోతుంది..
తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. ఓటీటీల్లోనూ ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. అయితే, హనుమాన్ సినిమా తెలుగులో టీవీలో వచ్చేందుకు రెడీ అవుతుంది.. అందుకోసం డేట్, టైం ఫిక్స్ చేసుకుంది..
ఈ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 5. 30 గంటలకు ప్రసారం కానుంది.. శ్రీరామనవమి సందర్బంగా జీ తెలుగు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.. ఈ సినిమాను టీవీ లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు..
The date is set 💥💥Lock 🔐 it in your calendar 🗓️ for the epic arrival of HanuMan🔥
Watch World Television Premiere #HanuMan On April 28th, Sunday at 5:30 PM on #ZeeTelugu#HanuManOnZeeTelugu #BiggestBlockBuster #ZeeTeluguPromo #ZeeTelugu @tejasajja123 @PrasanthVarma… pic.twitter.com/3dcMgC7tRe
— ZEE TELUGU (@ZeeTVTelugu) April 17, 2024