Ghalib al-Rahwi: యెమెన్‌లోని హౌతి తిరుగుబాటు దళాలపై ఇజ్రాయెల్ భారీ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఈ దాడిలో హౌతి గ్రూప్‌కు చెందిన సైనిక, రాజకీయ ప్రముఖులు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా తెలిపిన ప్రకారం.. హౌతి ప్రధానమంత్రి ఘలిబ్ అల్-రహ్వీతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ మీడియా ఇప్పటి వరకు జరిగిన అత్యంత పెద్ద ఎయిర్ స్ట్రైక్ అని పేర్కొంది. హౌతి చీఫ్ అబ్దుల్ మాలిక్ హౌతి…
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ రాజకీయ నేత సలాహ్ అల్-బర్దవీల్ మరణించాడు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ రాజకీయ నాయకుడు సలాహ్ అల్-బర్దవీల్ మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. తనపై దాడి జరిగినప్పుడు బర్దవీల్ తన భార్యతో కలిసి ప్రార్థనలు చేస్తున్నాడని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పదే పదే ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం హమాస్‌ను సైనిక, పాలక సంస్థగా నాశనం చేయడమే అని చెప్పారు.…
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు.