పెరుగుతున్న కాలుష్యాలు.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి జుట్టు రాలుతుంది..జుట్టు పెరుగుదల ఆగడం, జుట్టు తెల్లగా మారడం, వెంట్రుకల తెగిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతుంటారు..జుట్టు చక్కగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి పట్టిస్తూ ఉంటారు. అలాగే మందార ఆకులను నూనెలో వేడి చేసి తలకు పట్టిస్తూ ఉంటారు. అయితే మందార ఆకులను వాడడం వల్ల ఎటువంటి జుట్టుకు ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మందార ఆకులను వాడడం వల్ల మనం చక్కటి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. మందార ఆకుల్లో ఉండే ఐసో ప్లేవనాయిడ్స్ కుదుళ్లకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. దీంతో రక్తంలో ఉండే పోషకాలు జుట్టుకు అందుతాయి..మందార ఆకులో ఉండే రసాయనాలు జుట్టు కుదుళ్ల వద్ద ఉండే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు పొడవుగా పెరుగుతుంది. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది..
ఇకపోతే మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటాయి. దీంతో జుట్టు చిట్లడం, జుట్టు తెగిపోవడం, జుట్టు ఎర్రగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మందార ఆకులు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ ఆకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..మందారం ఆకులను పెరుగుతో కలిపి పేస్ట్ గా చేసి కుదుళ్లకు పట్టించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..