Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం జ్ఞానవాపి మసీదు పై వారణాసి కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. మసీదును సర్వే చేయాలని తీర్పు వెల్లడించింది. దీనికి కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించారు. మసీదు లోపలి భాగాలను సర్వే చేయాలని కోర్ట్ ఆదేశించింది. పూర్తిగా వీడియోగ్రఫీ చేసి మే 17 వరకు నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ఓ వర్గం వారు వీడియోగ్రఫీని ఆపాలని పిటిషన్ వేయగా… కోర్ట్ మాత్రం సర్వేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం వారు మసీదులో సర్వే చేయడాన్ని వ్యతిరేఖిస్తుండగా… మరో వర్గం వారు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని.. ఇప్పటికీ మసీదులో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని.. తమకు ఆ మసీదును అప్పగించాలని కోరతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ట్ వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మొగల్ చక్రవర్తుల పాలన సమయంలో ఔరంగబేబు జ్ఞానవాపి ఆలయాన్ని మసీదుగా మార్చారని వాదనలు ఉన్నాయి. అయితే ఇందుకు నిజం చేకూర్చే విధంగా మసీదు వెనకభాగంలో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నట్లుగా మరోవర్గం వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే బాబ్రీని కోల్పోయాం…మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. వారణాసి కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా ఉందని విమర్శించారు. యోగీ ఆదిత్య నాథ్, బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!