విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
రెండు నెలల క్రితం విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విమానాల సంఖ్య తగ్గడంతో తో పాటు, బాగా పెరిగిన టికెట్ల ధరలు, ధరలు విపరీతంగా పెరిగినా టికెట్లు కొరత వలన ఏర్పడుతున్న తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. వెంటనే విమానాల సంఖ్య పెంచడం ద్వారా, అసౌకర్యాన్ని తొలగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని , వివిధ విమానయాన సంస్థలను లేఖ ద్వారా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు.
Disha App Event: దిశ యాప్ మహిళలకు రక్షణ కవచం