కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు.
GoFirst: స్వచ్ఛంద దివాలా ప్రక్రియలో ఉన్న ఎయిర్‌లైన్ GoFirst విమాన సేవలు ఇప్పుడు జూన్ 28 వరకు నిలిచిపోనున్నాయి. Go First శనివారం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ఈ సమాచారాన్ని అందించింది.
విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్…
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…