Kingston Movie : కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొందిన జివి ప్రకాష్ కుమార్.. హీరోగా మారి విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లేటెస్ట్ గా అతను నటిస్తున్న ‘కింగ్‌స్టన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్‌ను ప్రముఖ నటుడు శివకార్తికేయన్ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలను అమాతం పెంచింది. ఫస్ట్ లుక్‌లో జివి ప్రకాష్ ఓ బోట్ పై నిలబడి, చేతిలో దీపం పట్టుకుని కనిపిస్తున్న దృశ్యం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ‘కింగ్‌స్టన్’ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర నేపథ్యంలోని ఈ హారర్ అడ్వెంచర్ జానర్‌లో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించనుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు. జీవీ ప్రకాష్ సరసన దివ్య భారతీ హీరోయిన్ గా నటిస్తుండగా, ‘మెర్కు తొడర్చి మలై’ ఫేమ్ ఆంటోని, చేతన్, కుమారవెల్, సాబు మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:HMPV Virus: లాక్‌డౌన్ అంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
ఈ సినిమా విజువల్స్‌ను గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ ద్వారా తెరపైకి రానున్నారు. జీవీ ప్రకాష్ స్వయంగా మ్యూజిక్ అందించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలువనుంది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాటలు ధివేక్ అందించగా, సాంకేతిక విభాగాల్లో కూడా అత్యుత్తమ నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ ఒక ప్రత్యేక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన తన 25వ చిత్రాన్ని హీరోయిన్ గా చేస్తూ, నిర్మాతగానూ మారడం విశేషం. ఆయన తన పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ కింద ఈ సినిమా నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో సాగే కథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జీవీ ప్రకాష్‌తో పాటు దర్శకుడు కమల్ ప్రకాష్ చేసిన కృషి తప్పకుండా ఈ సినిమాను భారీ విజయాల బాటలో నిలబెట్టనున్నాయని మేకర్స్ అంటున్నారు.
Read Also:Baladitya : నటుడు బాలాదిత్యను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న నెటిజన్లు