Gurugram: గురుగ్రామ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఎంజీ రోడ్‌లో ఉన్న ఓ క్లబ్‌లో డ్యాన్సర్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహానికి అంగీకరించలేదన్న కోపంతో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బరౌట్ ప్రాంతంలో పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని తుషార్ అలియాస్ జాంటీ (25), శుభమ్ కుమార్ అలియాస్ జానీ (24)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతానికి చెందినవారు.
Viral Video: మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదన్న కోపంతో.. ఏకంగా ట్రాక్టర్ తీసుకొని దున్నేసాడు..!
గురుగ్రామ్ పోలీసుల పీఆర్‌వో సందీప్ తురాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి 1 గంట మధ్య జరిగింది. తుషార్, కల్పన (25) అనే మహిళను తన భర్తను వదిలి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో అతడు తుపాకీ తీసి దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కల్పనకు కడుపు భాగంలో గాయం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయి బరౌట్‌లో దాక్కున్నారు.
Syria: శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో భారీ పేలుడు.. 8 మంది మృతి..
పోలీసుల సమాచారం మేరకు.. తుషార్ వడ్డీ వ్యాపారం చేస్తుండగా, శుభమ్ గ్లాస్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తుషార్‌కు గత ఆరు నెలలుగా కల్పనతో పరిచయం ఉండగా, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. నెల రోజుల క్రితం ఢిల్లీలోని నజఫ్గఢ్‌లో కల్పన ఇంటి వద్ద కూడా బెదిరింపుల కోసం కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం గాయపడిన మహిళను సెక్టార్ 43లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ ఉండటంతో వాంగ్మూలం ఇవ్వలేని పరిస్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద సెక్టార్ 29 డీఎల్‌ఎఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీ కోరనున్నట్లు, కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ ఇంకా లభ్యం కాలేదని సందీప్ తురాన్ తెలిపారు.