Guntur Train Assault: గుంటూరు జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం జరిగింది. గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్రగంజ్ నుంచి చెర్లపల్లి వెలుతున్న ట్రెయిన్ మహిళా భోగిలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు.. గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బ్యాగ్, ఫోన్ లాక్కొన్నాడు నిందితుడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. మహిళ కేకలు వేయడంతో పెదకూరపాడు వద్ద ట్రెయిన్ లో నుంచి దూకి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు చర్లపల్లికి చేరుకున్న తరువాత జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నడికుడి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Tamil Nadu: ఎన్నికల్లో ‘ఉచిత భార్య’ వాగ్దానం కూడా ఇవ్వొచ్చు.. దుమారం రేపుతున్న ఎంపీ వ్యాఖ్యలు