Site icon NTV Telugu

IPL 2025: ఎలిమినేటర్ ఆడితే.. టైటిల్ కష్టమా?

Ipl 2025 1

Ipl 2025 1

ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.

READ MORE: CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!

అంతకు ముందు, ఆ తర్వాత ఎలిమినేటర్ లో పాల్గొన్న ఏ జట్టు కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ , గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ను ఓడించింది. ఆ తర్వాత క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ పోటీపడ్డాయి. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్‌ టీం ఫైనల్లో ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఏ ఒక్క జట్టు కూడా ఛాంపియన్ కాలేదు.

READ MORE: Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..

మరి ఈ సారి ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక పంజాబ్, ఆర్సీబీ జట్టులో ఎదో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తుందా చూడాలి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో టాప్-2 జట్ల మధ్య మొదటి క్వాలిఫయర్ జరుగుతుంది. తర్వాత 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్-2 గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఏదేమైనా జూన్ 3న ఫైనల్లో తలపడే జట్టేదే రేపే తేలనుంది.

Exit mobile version