ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.