Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అయినప్పటికీ.. చైనా మాంజా మార్కెట్‌లల్లో ఇంకా విచ్చలవిడిగా లభిస్తూనే ఉంది. చైనా మాంజా కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. తాజాగా మరో ప్రాణం కూడా పోయింది. గాలి పటానికి ఉన్న మాంజ తగిలి ఓ వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. బల్వంత్ పటేల్ అనే వ్యక్తి కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముండేవాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
Read Also: Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్
సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్‌లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరు చూసిన ఇక్కడి వ్యాపారులు సొంతంగా.. సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. మాంజాలో గాజు ముక్కలను, ఇతర కెమికల్స్ ను కలుపుతున్నారు. దాంతో ఆ దారం కత్తిలా మారుతోంది. అదే ఇప్పుడు మనిషి పాలిట ఉరితాడుగా మారింది.