భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.
Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.