Man Stabs Girl: ప్రేమను నిరాకరించిందని.. బాలికను 34 సార్లు పొడిచిన వ్యక్తికి మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Stabs Girl: తన ప్రతిపాదనను తిరస్కరించినందుకు మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచిన గుజరాత్‌కు చెందిన వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అరుదైన కేసు అని కోర్టు పేర్కొంది. తనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిరాకరించడంతో ఆ వ్యక్తి బాలికను కత్తితో పొడిచినట్లు తెలిసింది. ఈ సంఘటన 2021లో జరిగింది. నిందితుడు జయేష్ సర్వయ్య (26) దాడి సమయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి సోదరుడిని కూడా గాయపరిచాడు. అతనిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Pees On Woman: రైలులో మహిళపై మూత్ర విసర్జన.. తాగుబోతు టికెట్ చెకర్ అరెస్ట్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఆ వ్యక్తి, మైనర్ బాలిక జెట్‌పూర్ తాలూకాలోని జెటల్‌సర్ గ్రామానికి చెందినవారు. జయేష్ సర్వయ్య బాధితురాలిని చాలా కాలంగా వేధిస్తున్నాడు. మార్చి 16, 2021న, నిందితుడు బాధితురాలి ఇంటికి ప్రతిపాదనతో వెళ్లాడు. బాలిక దానిని తిరస్కరించింది. ప్రపోజల్‌ను తిరస్కరించిన బాలిక నిర్ణయంపై ఆగ్రహించిన నిందితుడు బాధితురాలిని కొట్టి, సదరు బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా 34 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు. జయేశ్‌కు మరణశిక్ష పడిన విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?