Pees On Woman: రోజురోజుకు తాగుబోతుల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. విమానంలోనైనా, రైలులోనైనా విచక్షణ లేకుండా తాగిన మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అమృత్ సర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ఓ ట్రివెల్ టికెట్ ఎక్జామినర్ ( టికెట్ చెకర్ ) తాగిన మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త రాజేష్ కుమార్‌తో కలిసి రైలులో ప్రయాణిస్తోంది.
అమృత్‌సర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్ ఏ1 కోచ్ లో ప్రయాణిస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి టికెట్ చెకర్ మున్నా కుమార్ మహిళ తలపై మూత్ర విసర్జన చేశాడు. విషయాన్ని గమనించిన సదరు మహిళ, ఆమె భర్త టికెట్ చెకర్ మున్నా కుమార్‌తో గొడవకు దిగారు. మహిళ అరుపుల విన్న తోటి ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్న టీటీఈని పట్టుకుని సీటుకు కట్టేశారు. రైలు సోమవారం లక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే టీటీఈని రైల్వే పోలీసులకు అప్పగించారు. టీటీఈని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు.
Read Also: Maharashtra: ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి
కొన్ని నెలల క్రితం విమానంలో ఇదే తరహాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. అనంతరం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా 4 నెలల నిషేధం విధించారు. తాజాగా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఐజీఐ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అరెస్టు చేశారు