Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Gujarat Congress Party Rahul Gandhi Hardik Patel On Same Stage

Gujarat: సమసిన వివాదం.. ఒకే స్టేజీపై రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్

Published Date :May 11, 2022 , 1:57 pm
By Venu Goapl Reddy
Gujarat: సమసిన వివాదం.. ఒకే స్టేజీపై రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను మూటకట్టుకుంది.

కాగా… ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం గుజరాత్ లో పర్యటించారు రాహుల్ గాంధీ. అయితే అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే గుజరాత్ కాంగ్రెస్ లో కూడా లుకలుకలు కనిపిస్తున్నాయి. పాటిదార్ ఉద్యమ నాయకుడిగా హార్ధిక్ పటేల్ కు పేరుంది. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి.  అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ రాహుల్ గాంధీ కార్యక్రమంలో హార్థిక్ పటేల్ పాల్గొన్నారు. ఒకే వేదికను పంచుకున్నారు.

ఇటీవల తన ట్విట్టర్ బయో నుంచి హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ జెండా, పేరును తొలగించడంతో ఒక్కసారిగా హార్ధిక్ పటేల్ పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరుతారని చర్చ జరిగింది. గతంలో కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీని హార్ధిక్ పటేల్ పొగడటం కూడా ఈ అనుమానాలకు తావిచ్చాయి. మరో వైపు ఢిల్లీలో పాటు ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆప్ గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఆప్ లో చేరుతారంటూ వాదనలు వినిపించాయి.

ఇన్ని అనుమానాల మధ్య ఓ క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం హార్ధిక్ పటేల్ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారనేది స్పష్టం అయింది. అయితే పలు సందర్భాల్లో… రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని… కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీరుతోనే విసిగిపోతున్నా అంటూ హార్ధిక్ పటేల్ విమర్శించారు. ఎన్నికలు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని  ఈసందర్భంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని పనిచేసేలా చూడాలని కోరుతున్నారు. 1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ సారి హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Gujarat
  • hardik patel
  • rahul gandhi

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions