Gudivada Amarnath: ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ గ్రామంలో తమ పార్టీకి పూర్తి మద్దతు ఉందని ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసం అని ఆయన ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాలు సాధించిందని వారు పేర్కొన్నారు. అలాగే, గత ఎన్నికల్లో టీడీపీకి 1350 ఓట్లు రాగా, వైఎస్ఆర్సీపీకి 150 ఓట్ల తేడా మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.
Also Read: Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్ స్టార్మర్ కౌంటర్..
సభ్యత్వం నమోదు కోసం టీడీపీ నేతలు ప్రజల ఆధార్ కార్డులను తీసుకుని వారిని మోసం చేస్తున్నారని, పక్క రాష్ట్రాల వారికి కూడా టీడీపీ సభ్యత్వం కల్పించారని గుడివాడ అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలను బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ నాయకులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసారు.
Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనితపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ లేఖను అమ్మే స్థాయికి చేరుకున్న అనిత పేషీ, సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. టీటీడీ లడ్డు వివాదంపై పెద్ద ఎత్తున మాట్లాడిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని, భీమిలి నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.