స్వయం ఉపాధి కోసం కొందరు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. పెట్టిన పెట్టుబడిపోను ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తుంటారు. అయితే కూరగాయలు అమ్ముకునే ఓ విక్రేతకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. అతనికి జీఎస్టీ అధికారులు రూ. 29 లక్షల నోటీసు పంపారు. వస్తు, సేవల పన్ను నిబంధనల ప్రకారం ఈ భారీ చెల్లింపు చేయమని కోరారు. దీంతో అతడు షాక్ కి గురయ్యాడు. అతడు కర్ణాటకకు చెందిన శంకర్‌గౌడ హదిమణి. అసలు 29 లక్షల జీఎస్టీ నోటీస్ ఎందుకు ఇచ్చారు? కూరగాయల వ్యాపారి భారీ మొత్తంలో సంపాదిస్తున్నట్లు ఎలా గుర్తించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read:AP Rains: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్‌గౌడకు స్థానిక మున్సిపల్ హైస్కూల్ సమీపంలో కూరగాయల దుకాణం ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా కూరగాయలు అమ్ముతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతని వద్ద కూరగాయలు కొనే కస్టమర్లలో ఎక్కువ మంది UPI లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేశారు. ఇది శంకర్‌కు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే GST అధికారులు అతనికి నోటీసు పంపారు. అతను నాలుగు సంవత్సరాలలో రూ.1.63 కోట్ల లావాదేవీలు చేశాడని, దీని ప్రకారం, అతడు రూ.29 లక్షల జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read:UAE: షార్జాలో మరో విషాదం.. బర్త్‌డే రోజే కేరళ వివాహిత అనుమానాస్పద మృతి
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. జీఎస్టీ నోటీసు అందుకున్న తర్వాత, కూరగాయల విక్రేత శంకర్‌గౌడ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొనుగోలు చేసి తన చిన్న దుకాణంలో విక్రయిస్తానని చెప్పాడు. ఇక్కడ చాలా మంది కస్టమర్లు UPI చెల్లింపును ఇష్టపడతారు. అతను ప్రతి సంవత్సరం తన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్ ఫైల్)ను దాఖలు చేస్తానని, దాని పూర్తి రికార్డును కూడా ఉంచుతానని చెప్పాడు. నోటీసు అందినప్పటి నుంచి అతను భయాందోళనలో ఉన్నాడు. నేను 29 లక్షల రూపాయలు ఎలా చెల్లించగలను అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read:Samantha: నిర్మాత, హీరోయిన్గా సినిమా ఫైనల్ చేసిన సమంత?
నిబంధనల ప్రకారం, ఒక విక్రేత రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్ చేయకుండా విక్రయిస్తే, అటువంటి తాజా, చల్లని కూరగాయలపై GST వర్తించదు. మరోవైపు, కూరగాయలు బ్రాండ్ చేయబడినా లేదా ప్యాక్ చేయబడినా, వాటిపై 5% GST వర్తిస్తుంది. అయితే, కర్ణాటకలో శంకర్‌గౌడ కేసు తర్వాత , అతనిలాంటి చాలా మంది చిన్న వ్యాపారులు UPI చెల్లింపులను అంగీకరించడం మానేసి, ఇప్పుడు నగదును మాత్రమే అంగీకరిస్తున్నారు. ఇటీవల ఒక నివేదిక ప్రకారం, డిజిటల్ చెల్లింపులను అంగీకరించే వ్యాపారులపై తాము నిశితంగా నిఘా ఉంచుతున్నామని కర్ణాటక GST విభాగం స్పష్టం చేసింది. జూలై 12న, GST నమోదిత పరిమితిని మించి మొత్తం టర్నోవర్ ఉన్న వ్యాపారులకు నోటీసు పంపుతామని తెలిపింది.