ఖుషి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన తర్వాత సమంత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. నిజానికి ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత తర్వాత తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసింది. తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఒకపట్టాన ఒప్పుకోకుండా ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి చేసిన శుభం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం లాభాల పంట పండించింది.
Also Read:Pawan Kalyan: పవన్’ను చూసి నేర్చుకోండబ్బా!
ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంతకు స్నేహితురాలైన నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె ఒక సినిమా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా మూడో సినిమాగా పోతుంది. వీరిద్దరూ కలిసి గతంలో సిద్ధార్థ హీరోగా జబర్దస్త్, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌గా ఓ బేబీ సినిమాలు చేశారు.
Also Read:Ustaad Bhagat Singh: మార్పులు చేర్పులతో కానిచ్చేస్తున్నారా?
ఇక నందిని రెడ్డి చివరిగా సంతోష్ శోభన్ తో చేసిన అన్ని మంచి శకునములే సినిమా థియేటర్లలో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక గ్యాప్ తీసుకున్న నందిని రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోగా సమంత అది విని ఎక్సైట్ అయినట్లుగా తెలుస్తోంది. సమంత ఈ సినిమాలో నటిస్తూ స్వయంగా నిర్మాతగా సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసి పట్టాలెక్కించడమే లేట్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది.