గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్, కేసినోలపై 28 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్‌టీ కౌన్సిల్ 50వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, కేసినోలపై 28 శాతం జీఎస్‌టీని విధించాలని చాలాకాలం క్రితమే మంత్రుల బృందం జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. దీనిపై పలుమార్లు జీఎస్‌టీ కౌన్సిల్‌లో చర్చ కూడా కొనసాగింది. చివరకు 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి వీటిని తీసుకురావాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది.
Read Also: CM YS Jagan: ఎస్‌ఐపీబీలో సీఎం కీలక వ్యాఖ్యలు.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఇలా చేయండి..
జీఎస్‌టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమింగ్‌పై పూర్తి ఫేస్ వ్యాల్యూపై 28 శాతం పన్ను రేటును విధించేందుకు నిర్ణయించింది.. ఇది స్కిల్ అండ్ ఛాన్స్ గేమింగ్ మధ్య తేడా లేకుండా ఉంటుందని, పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య ధృవీకరించారు. ఆన్‌లైన్ గేమింగ్ మాత్రమే కాదు, కేసినోలు, గుర్రపు పందేలకు కూడా ఫుల్ ఫేస్ వ్యాల్యూపై 28 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, రేస్‌కోర్స్ లాంటి వాటిని 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి తీసుకురావాలన్న అంశంపై గతంలోనే మంత్రుల బృందం పలుసార్లు చర్చించింది.
Read Also: Harshavardhan Rane: పెళ్ళైన హీరోయిన్స్ తోనే తెలుగు హీరో ఎఫైర్.. ఇప్పటికీ ముగ్గురు..?
దీనిపై పలు నివేదికలను కూడా జీఎస్టీకి సమర్పించారు. వీటిని 18 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోనే ఉంచాలని ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ నుంచి పలు డిమాండ్లు కూడా వచ్చాయి. FICCI గేమింగ్ కమిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని అతిపెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలతో కూడిన ఒక కమిటీ GST రేటును 28 శాతానికి పెంచవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ ని కోరింది. ఇది.. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ మనుగడకు చాలా హానికరం అని వారు అన్నారు. దీన్ని వల్ల వ్యాపార కార్యకలాపాలు ఇంత అధిక పన్నులతో మనుగడను సాగించలేవు అని ఆన్ లైన్ కంపెనీలు చెప్పాయి. అయితే, ఇప్పటికే 28 శాతం జీఎస్‌టీలో అనేక వస్తువులున్నాయి. పొగాకు, సిగరెట్స్, కెఫైన్ డ్రింక్స్, పాన్ మసాలా, కార్బొనేటెడ్ డ్రింక్స్, పొగాకుతో చేసిన వస్తువులు, టైర్లు, ఏసీలు, డిష్ వాషింగ్ మెషీన్స్, స్మోకింగ్ పైప్స్ లాంటివి అన్నీ 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో ఇప్పటికే ఉన్నాయి.