ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్పత్రి పాలయ్యారన్న విషయం మీకు తెలుసా..? ధోని ఏంటీ.. ఆస్పత్రి పాలవ్వడమేంటనీ షాకవుతున్నారా..? మొన్నటిదాకా ఐపీఎల్ ఆడిన మహీ.. చివరకు గుజరాత్ తో జరిగిన ఫైనల్ లోనూ కప్ సాధించి పెట్టాడు. అలాంటిది ధోనీ హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు. అసలు ఏమైంది. ఈ వార్త విన్న ధోనీ అభిమానుల్లో తీవ్ర కలవరం రేపుతుంది. అంతా టెన్షన్ వద్దంటూ.. కొందరు నెటిజన్స్ అంటున్నారు.
Also Read : Siddharth Roy Teaser: మరో ‘అర్జున్ రెడ్డి’ లా ఉంది.. ‘అతడు’ బుడ్డోడుకు హిట్ అందేనా
ఐపీఎల్ టోర్నీలో ఆడుతుండగానే మహీ మోకాలి సమస్యతో బాధపడ్డాడు. ఐపీఎల్ మధ్యలో నుంచైనా అతను నిష్క్రమించవచ్చు కానీ.. వెళ్లలేదు. ఎందుకంటే ధోనీకి 2023 ఐపీఎల్ చివరిదని గుసగుసలు వినపడ్డాయి. అయితే ధోనీ అలా కాకుండా తన టీమ్ కోసం ఆడాడు. ధోని పట్టుబట్టాడంటే చేసి తీరుతాడు. అందుకనే ఐపీఎల్ టోర్నీ ముగిశాక సర్జరీ చేయించుకుందామనుకున్నాడేమో.. మొత్తానికి ఫైనల్ గెలిచి కప్ అందించి పెట్టాడు. అంతేకాకుండా మోకాలి నొప్పితోనే చెపాక్ వేదికగా జరిగిన సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానం అంతా కలియతిరిగాడు. అభిమానుల వైపు జెర్సీలు విసిరాడు. ఆ సమయంలోనే ధోనీ తన మోకాలికి సపోర్ట్ కోసం క్యాప్ ధరించి కన్పించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : 3D Printed Temple: తెలంగాణలో తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్
మొత్తానికైతే మహేంద్ర సింగ్ ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. గురువారం(జూన్ 1) ఉదయం 8 గంటల సమయంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిషియన్ దిన్షా పార్దివాలా ఈ ఆపరేషన్ చేశారు. పార్దివాలా స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్‌లో నిపుణుడు కాగా, ప్రస్తుతం స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. పంత్‌కు సైతం ఆయనే చికిత్స అందిస్తున్నారు. అయితే ఐపీఎల్ కప్ గెలిచిన 48 గంటల్లోనే ఈ చికిత్స జరగడం గమనార్హం. ఇదిలావుంటే ధోని శస్త్రచికిత్సకు వెళ్లేముందు భగవద్గీత చదువుతా కనిపించాడు.