Javeria Abbasi: పాకిస్తాన్ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమె తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేక వివాదాలకు దారితీశాయి. 1997లో కేవలం 17 ఏళ్ల వయసులో, జవేరియా తన సవతి సోదరుడు షమూన్‌ను వివాహం చేసుకుని అందరినీ షాక్ చేసింది. ఈ వివాహంపై విపరీతమైన విమర్శలు వచ్చినా.. కొందరు వారి బయోలాజికల్ సోదరసోదరీమణులు కానందువల్ల ఈ బంధాన్ని సమర్థించారు. కానీ, సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక షమూన్‌తో విడాకులు తీసుకుంది. అప్పటికే వారికి అంజెలా అనే కుమార్తె జన్మించగా.. ఆమెను సింగిల్ మదర్‌గా పెంచి పెద్ద చేసింది.
Police Arrest: బీటెక్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ఆత్మహత్య కేసులో ఐదుగురు అరెస్ట్
కుమార్తె జీవితంలో స్థిరపడిన తర్వాత 2024లో 51 ఏళ్ల వయసులో జవేరియా మళ్లీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యాపారవేత్త అడీల్ హైదర్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. ఈ నిర్ణయానికి ఆమె కుమార్తె అంజెలా ప్రోత్సాహం ముఖ్య కారణమని జవేరియా వెల్లడించింది. ఈ రెండో పెళ్లి కూడా విమర్శలకు గురైనప్పటికీ.. తన అభిమానులు, అత్తారింటి మద్దతుతో ఆమె వాటిని ధైర్యంగా ఎదుర్కొంది.
IP69 రేటింగ్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో Oppo A6 Pro 4G లాంచ్.. ధర ఎంతంటే?