Breaking News: తెలంగాణలో గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
- గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్
- తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా
- డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
Also Read
కాగా.. గతేడాది మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే.. మొదటగా ఆగష్టు 9, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాగా.. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు.. గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది.
Olympic Medals: ఒలింపిక్స్‌లో అందించే బంగారు పతకంలో ఎంత బంగారముంటుందో తెలుసా..?
నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ మరోసారి ప్రకటన చేసింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్- 2 పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-2ను ప్రభుత్వం వాయిదా వేసింది.
- Tags
- breaking news
- december
- DSC
- Exams
- Group 2
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!