హైద్రాబాద్ లో పర్యావరణ హితమైన బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను గచ్చిబౌలి స్టేడియం వద్ద మంత్రి ప్రారంభించారు. మొత్తం 500 బస్సులను ప్రారంభించనున్నారు… అందులో ఇప్పుడు 25 బస్సులు రోడ్ ఎక్కనున్నాయి.. మిగితావి నవంబర్ లో ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్ లో బస్సులు నడుస్తాయి. 35 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులను నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. బస్ లో సీసీ కెమెరాలు కూడా అమర్చి, లొకేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. హైద్రాబాద్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్దమవుతోందన్నారు. 550 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను తీసుకురాబోతుందని, హైద్రాబాద్ లాంటి మహా నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలకు సిద్ధమవుతున్నామన్నారు.
Also Read : Mahesh Babu: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో మహేష్ బాబు
అంతేకాకుండా.. ‘అన్ని బస్సులను ac బస్సులుగా కన్వర్ట్ చేస్తే మంచిది… ఆర్టీసీ ఆలోచించాలి.. అన్ని బస్సులను మెట్రో లకు అనుసంధానం చెయ్యాలి… తక్కువ సమయంలో గమ్యాన్ని రీచ్ అవుతాము… 35 సీటింగ్ అయినప్పటికీ AC బస్ కాబట్టి నిలబడి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.. ఎండీ సజ్జనార్ వచ్చాక కొత్త ఒరవడి తీసుకొచ్చారు… బస్ ఫెసిలిటీ నీ పెంచుకున్నాం… ఎలక్ట్రికల్ బస్ లు రానున్న రోజుల్లో పంచుకుంటాం.. కేంద్ర విధానాల వల్ల ఎలక్ట్రిక్ బస్ లను పెంచుకొలేక పోతున్నాము… ఎలక్ట్రికల్ వెహికిల్ కి సబ్సిడీ కూడా ఇచ్చాము… ప్రజలు ఎలక్ట్రికల్ వెహికిల్ కి షిఫ్ట్ అవుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం రాకముందు.. 71 లక్షల వాహనాలు ఉండేవి… ఇప్పుడు 1.52 కోట్ల వాహనాలకు పెరిగాయి.. మన అందరికీ శుభవార్త… ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం అవ్వడం… గెజిట్ కూడా రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులుగా మారిపోయారు… నేను మంత్రిగా ఇంత గొప్ప బిల్లు నీ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది..
నేను వచ్చాక చాలా సంస్కరణలు చేశాను… ఫాన్సీ నంబర్ల ఇష్యూ చేసేది రిఫరెన్స్ లతో అయ్యేవి… కానీ ఈ ఫాన్సీ బిడ్డింగ్ ఏర్పాటు చేసాము… సజ్జనర్ గారు వచ్చాక ఆర్టీసీ నీ సమర్థవంతంగా నడిపించారు…’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Minister Amarnath: ప్రతిపక్షాల గొంతు నొక్కాల్సిన అవసరం మాకు లేదు..