Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Greater Warangal Municipal Corporation Corporators To Joins Congress Today

Telangana Congress: కాంగ్రెస్ వైపు.. కార్పొరేటర్ల మలుపు!

Published Date :March 4, 2024 , 8:58 am
By Sampath Kumar
Telangana Congress: కాంగ్రెస్ వైపు.. కార్పొరేటర్ల మలుపు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు నియోజక వర్గంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి టచ్‌లో వున్నారు. వీరంతా సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వచ్చే మే నాటికి మేయర్ గుండు సుధారాణి పదవీకాలం మూడేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో తన పదవిని పదిలం చేసుకోవడానికి మేయర్ సైతం కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లు పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌లో చేరిపోవడంతో పదవీ గండం తప్పదనేది ఆమెకు స్పష్టమయ్యింది. దీంతో మేయర్ సుధారాణి అడుగులు కూడా కాంగ్రెస్ వైపు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అత్యంత వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాల్టీలలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా మున్సి పాల్టీలలో అవిశ్వాత తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్‌లను దింపేయడం కొనసాగుతుంది. గ్రేటర్ వరంగల్‌లో సైతం ఇందుకు రంగం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకరఫ్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లను ఆదివారం సాయంత్రానికే హైదరాబాద్ చేర్చడానికి రంగం సిద్ధమైంది. వీరంతా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Also Read: Minister Seethakka: రాత్రివేళ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సీతక్క.. విద్యార్థులతో ముచ్చట్లు!

వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవిత, 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, 21వ డివిజన్ కార్పొరేటర్ గపూర్ ఖాన్, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన, 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, 38వ డివిజన్ కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు, 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Municipal Corporation
  • telangana
  • telangana Congress
  • Warangal

తాజావార్తలు

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

  • Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

  • Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..

  • 2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions