Site icon NTV Telugu

Aadi Srinivas: కవిత కామెంట్స్‌తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది…

Aadi Srinivas

Aadi Srinivas

కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.

READ MORE: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు

“బీజేపీ, బీఆర్ఎస్ ఏకమై దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మొదటి నుంచి చెబుతున్న మాట నిజమైంది.. మా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు.. కవిత వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించాల్సిందే.. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని కేటీఆర్ ఇంకేదో మాట్లాడుతున్నాడు.. బీజేపీ తో డీల్ పైన బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు సమాధానం చెప్పాలి.. రెండు పార్టీ లు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నప్పటికి తెలంగాణ ప్రజలు మా వైవు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెగిపోయింది. కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం ఎందుకు చెప్పడం లేదు.?” అని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

READ MORE: Allu Arjun : గౌరవంగా భావిస్తున్నా.. గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్..

Exit mobile version