గూగుల్ క్రోమ్ వినియోగదారులకు (Google Chrome users) భారత ప్రభుత్వం (Government) తీవ్ర హెచ్చరికను జారీ చేసింది (Warning). హై-రిస్క్ కారణంగా వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.
ఏవేవి రిస్క్ అంటే..
సైబర్ అటాకర్లు దాడి చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశముందని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు పేర్కొంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్ 11, 12, 12L, 13, 14లకు ఈ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపింది. దీనికి పరిష్కారంగా కంపెనీ నుంచి ఏదైనా లేటెస్ట్ అప్‌డేట్ వస్తే వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.
Google ద్వారా భద్రతా పరిష్కారాలను కలిగి ఉన్న తాజా అందుబాటులో ఉన్న అప్‌డేట్‌తో Google Chromeని అప్‌డేట్ చేయాలని Cert-In సూచించింది. వినియోగదారులు తమ Google Chrome OS ఇన్‌స్టాలేషన్‌లను LTS ఛానెల్‌లో వెర్షన్ కి వెంటనే అప్‌డేట్ చేయాలి. తద్వారా సిస్టమ్ భద్రతను మెరుగుపరుస్తుందని తెలిపింది.