Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: అధిక పెట్రో ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే, మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గించాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
Read Also: Amit Shah: తెలంగాణపై బిజెపి దృష్టి.. ‘మిషన్ 2024’ కోసం పార్టీకి టార్గెట్ పెట్టిన అమిత్ షా
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
అయితే, ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోడీ ఆమోదం కోసం పంపించారని సమాచారం. ఇక, ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరల విషయంలో మార్పు ఉండదని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడింది.
Read Also: Drunk And Drive: దొరికితే చుక్కలే.. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సదరు సంస్థలు తగ్గించలేదు.. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా 58 వేల 198 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8, లీటర్ డీజిల్ ధర 6 రూపాయల మేర తగ్గింది. కొద్ది నెలలుగా పలు రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచకపోవడంతో పాటు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!