Karnataka Govt: మంత్రి నాగేంద్ర రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు. రాత్రి డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో అందజేశారు.
READ MORE: Crime: రూ.300కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు.. కట్ చేస్తే..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
నాగేంద్ర రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ కార్యాలయ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం మంత్రి రాజీనామాపై హైడ్రామా నడిచింది. ఈ నెల 6 లోపు మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ రోజున నాగేంద్ర రాజీనామా చేస్తారని భావించారు. ఆయన తాను రాజీనామా చేయలేదని, అన్ని విషయాలు మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నాగేంద్ర రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన డెత్ నోట్ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి రూ. 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ రెండూ వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.
“ఎవరూ (రాజీనామా) డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. మేము ముఖ్యమంత్రి, హోం మంత్రి తో చర్చించాం. నాగేంద్రతో కూడా మాట్లాడాం. తన ప్రమేయం ఏమీ లేదని హామీ ఆయన చెప్పారు. కానీ పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా, అతను పార్టీని ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నారు, అతను స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ప్రతిపాదించారు. ”అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!