NTV Telugu Site icon

Karnataka Govt: మంత్రి నాగేంద్ర రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి?

New Project (69)

New Project (69)

కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు. రాత్రి డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో అందజేశారు.

READ MORE: Crime: రూ.300కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు.. కట్ చేస్తే..

నాగేంద్ర రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ కార్యాలయ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం మంత్రి రాజీనామాపై హైడ్రామా నడిచింది. ఈ నెల 6 లోపు మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ రోజున నాగేంద్ర రాజీనామా చేస్తారని భావించారు. ఆయన తాను రాజీనామా చేయలేదని, అన్ని విషయాలు మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నాగేంద్ర రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన డెత్ నోట్‌ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి రూ. 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ రెండూ వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయి.

“ఎవరూ (రాజీనామా) డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. మేము ముఖ్యమంత్రి, హోం మంత్రి తో చర్చించాం. నాగేంద్రతో కూడా మాట్లాడాం. తన ప్రమేయం ఏమీ లేదని హామీ ఆయన చెప్పారు. కానీ పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా, అతను పార్టీని ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నారు, అతను స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ప్రతిపాదించారు. ”అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వెల్లడించారు.