కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.