టీఎస్పీఎస్సీ సర్వర్ నుంచి ప్రశ్నాప్రతం లీక్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రశ్నాపత్రం లీక్ కేసుపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై 2 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని టీఎస్పీఎస్సీని టీఎస్ గవర్నర్ తమిళిసై ఆదేశించారు. TSPSC నిర్వహించిన మరియు నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణించి, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు రాజ్ భవన్, TSPSC కార్యదర్శికి లేఖ రాసింది.
Also Read : Anjali: చరణ్ సినిమా తరువాత అంజలి పెళ్లి..?
లేఖలో, సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరింది. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు మరియు ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తీసుకోవడమే కాకుండా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కేసును సిట్‌కు బదిలీ చేసినట్లు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో TSPSC పేపర్ లీక్ కేసుపై విచారణ జరగనుంది. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ వ్యవహారంపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి.
Also Read : Off The Record: కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీకి లాభమెంత?