Windfall Gain Tax : ముడిచమురు ధరల పెరుగుదల తర్వాత దేశీయంగా ముడిచమురుపై విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఫిబ్రవరి 16, 2024 నుండి అమలులోకి వస్తుంది. క్రూడాయిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ప్రస్తుతం టన్నుకు రూ.3200 నుంచి రూ.3300కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై ఎగుమతి పన్నును పెంచారు. అయితే పెట్రోల్, ఏటీఎఫ్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంలో ఎటువంటి మార్పు లేదు.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఫిబ్రవరి 16 శుక్రవారం నుండి ONGC వంటి ప్రభుత్వ చమురు కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై టన్నుకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో రూ. 3300 విండ్‌ఫాల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే నెలలో దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.1700 నుండి రూ.3200కి ప్రభుత్వం పెంచింది.
Read Also:Ratha Saptami 2024: తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 75డాలర్లు దాటిన తర్వాత, ప్రభుత్వం దేశంలోని ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో విండ్‌ఫాల్ గెయిన్ ట్యాక్స్‌ను విధిస్తుంది. తద్వారా ప్రభుత్వం ఎగుమతుల ద్వారా వచ్చే అధిక ఆదాయాలపై మరింత పన్ను వసూలు చేస్తుంది. డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు సున్నా నుంచి రూ.1.50కి పెంచారు. ఎగుమతి చేసే డీజిల్‌పై ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. పెట్రోల్, విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం ప్రస్తుతానికి సున్నాగానే ఉంటుంది.
జూలై 1, 2022 నుంచి పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ATFపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో విండ్‌ఫాల్ గెయిన్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది. ముడిచమురు ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వం విత్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను పెంచుతుంది.
Read Also:Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు