పొంగల్ బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌తో పాటు నా సామిరంగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. అయితే వీటితో పాటు రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది కానీ థియేటర్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కోలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అక్కడ భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్ అయిపోయింది కాబట్టి… ఈ వారం తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా 25న కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అవుతుండగా.. అయలాన్ ఒక రోజు గ్యాప్‌తో థియేటర్లోకి రానుంది. అయితే… అయలాన్ సినిమా ప్రమోషన్స్ ఓ మోస్తరుగా జరుగుతున్నప్పటికీ కెప్టెన్ మిల్లర్ మాత్రం సైలెంట్‌గానే థియేటర్లోకి వచ్చేలా ఉన్నాడు.
ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అయలాన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తెలుగు హీరోలు ఎవరైనా గెస్ట్‌గా వస్తారా అనేది తెలియాల్సి ఉంది కానీ కెప్టెన్ మిల్లర్ మాత్రం ఈవెంట్ లేకుండానే థియేటర్లోకి రాబోతున్నాడు. అల్రెడీ తమిళ్‌లో హిట్ అయింది కాబట్టి… ఇక్కడ కూడా మౌత్ టాక్‌నే బెస్ట్ ప్రమోషన్స్ అని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నట్టున్నారు. ఈ కారణంగానే పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేనట్టున్నారు. గతంలో సార్ సినిమాను ఇక్కడ గట్టిగానే ప్రమోట్ చేశాడు ధనుష్. కానీ ఈసారి మాత్రం అలా చేయడం లేదు. మరి… ఈ రెండు సినిమాలకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.