Gorre Puranam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కామెడీ చిత్రం గొర్రె పురాణం. గత నెల 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో నెల రోజుల్లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సుహాస్.. ఈ తాజా చిత్రంతో హిట్ అందుకోకపోయినా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటానని మరోసారి నిరూపించుకున్నాడు. సుహాస్ నటించిన గొర్రె పురాణం చిత్రం ఆహా వీడియోలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ శుక్రవారం (అక్టోబర్ 4) X ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని వెల్లడించనప్పటికీ, అది త్వరలోనే వస్తుందని అంటున్నారు.
A quest for paradise turns into a fight for freedom.#GorrePuranam coming soon on aha pic.twitter.com/hfLE4bzHz2
— ahavideoin (@ahavideoIN) October 4, 2024
Read Also :TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?
సుహాస్‌తో పాటు పోసాని కృష్ణ మురళి, రఘు నటించిన గొర్రె పురాణం చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఆ గొర్రె రెండు మతాల మధ్య ఎలా నలిగిపోయిందో సినిమా ట్రైలర్‌లో చూపించారు మేకర్స్. ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో బక్రీద్ పండుగకు రావాల్సిన గొర్రె అక్కడి నుంచి తప్పించుకుని ఓ గుడిలోకి వెళ్లింది. దీంతో హిందువులు గొర్రెలు తమదని, తామే బలిస్తామని గొడవకు దిగారు. ఈ గొర్రెల కోసం రెండు వర్గాల మధ్య గొడవలు ఎక్కడికి దారితీశాయి? మరి చివరికి ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందో సినిమాలో చూడాలి. నిజానికి ఈ సినిమాలో హీరో సుహాస్ పాత్ర తక్కువే అయినా తనదైన శైలి నటనతో మెప్పించాడు.
Read Also :Harmanpreet Kaur: అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..(వీడియో)
అయితే ఈ చిత్రానికి థియేటర్లలో పెద్దగా స్పందన రాలేదు. ఇంతకుముందు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం, రైటర్ పద్మభూషణ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న సుహాస్ కు ఈ గొర్రె పురాణం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఇప్పుడు జనకైతేగనక అనే మరో సినిమాతో రాబోతున్నాడు. పవన్ సిహెచ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.