Harmanpreet Kaur: అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..(వీడియో)
- అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..
- 58 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత జట్టు ఓటమి పాలైంది. మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 58 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించించింది. ఇక 161 పరుగుల టార్గెట్ తో చేధనకు దిగిన భారత్ జట్టు ఆదినుండే చతికిలపడింది. చివరకి కేవలం 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయ్యి భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కివీస్ బ్యాట్స్‌మెన్‌కు రనౌట్ అయినా ఇవ్వకపోవడంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్‌లో ఆమె అంపైర్లతో వాగ్వాదానికి దిగింది. అంతే కాదు, బౌండరీ వెలుపల థర్డ్ అంపైర్‌తో భారత జట్టు కోచ్ వాగ్వాదానికి దిగడం కూడా కనిపించింది. దాంతో కొన్ని నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సంతృప్తి చెందలేదు. ఫీల్డ్ అంపైర్ వాదన తర్వాత బౌండరీ దగ్గర నిలబడి ఉన్న థర్డ్ అంపైర్‌తో ఆమె గొడవకు దిగింది. అదే సమయంలో భారత జట్టు కోచ్ అమోల్ మజుందార్ కూడా అంపైర్‌తో మాట్లాడుతున్నాడు.
IND W vs NZ W: ప్రపంచ కప్‌లో భారత్ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
14వ ఓవర్ చివరి బంతికి అమేలియా కెర్ ఒక పరుగు కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నం చేసారు. దాంతో హర్మన్ నుంచి బంతి అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్ అమేలియాను రనౌట్ చేయగలిగింది. దీంతో బ్యాటెర్ రనౌట్ అయినట్లు భావించి పెవిలియన్ వైపు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఇక్కడే, అంపైర్లు ఆ ఔట్ పరిగణలోకి రాదంటూ చెప్పారు. అంపైర్ బంతి అప్పటికే డెడ్ అయినట్లు తెలిపి ఆమెను వెనక్కు పిలిచింది. కాకపోతే., బంతి డెడ్‌గా ప్రకటించబడిన తర్వాత కూడా అమేలియా ఉద్దేశపూర్వకంగానే పరుగులు చేసేందుకు అవతలి ఎండ్ వైపు పరుగెత్తినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కానీ., అంపైర్ అమీలియాకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
https://twitter.com/anuj2488/status/1842220809093599318
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!