తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పదవిలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు నియమితులవ్వడం ఎప్పటి నుండో వస్తుంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు SVBC ఛానెల్ కు ఛైర్మెన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వి ఆ పదవి పొందాడు. అనుకోని వివాదం కారణంగా ఆయనను మధ్యలోనే ఆ పదవి నుండి తొలగించారు. అదే సమయంలో టాప్ సింగర్ మంగ్లీ టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించింది అప్పటి ప్రభుత్వం.
Also Read : Pongal 2025 : రవితేజ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించిందెవరు..?
కాగా మళ్ళి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన NDA కూటమి ప్రభుత్వంలో టీటీడీకి చెందిన పదవుల్లో టాలీవుడ్ నుండి ఎవరికి అవకాశం లభిస్తుందో అన్న చర్చ నడుస్తుంది. ఇప్పటికే టీడీపీ తరపున నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్ర రావు, నటుడు నిర్మాత మురళి మోహన్ బోర్డు మెంబర్ పదవి ఆశిస్తున్నవారి రేస్ లో ఉన్నారు. ఇక జనసేన నుండి ఎవరు చర్చ కూడా గట్టిగానే జరుగుతుంది. పవన్ కు ఆప్తులైన స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బోర్డు మెంబరు పదవి రేస్ లో ఉంది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పేరుతో పాటు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పవన్ తిరుమల శ్రీవారి దర్శన సమయంలో త్రివిక్రమ్ తరచూ కనిపిస్తున్నారు. ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన వెన్నంటే ఉంటున్నారు. మరి ఈ దఫా ఎవరు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కించుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.