మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’.ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం.భీమా మూవీ మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతోంది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు..ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. అయితే… ట్రైలర్ రిలీజ్ తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ‘అఖండ’తో కంపేరిజన్స్ వచ్చాయి. సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు గోపీచంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆయన దగ్గర ఈ కంపేరిజన్స్ గురించి ప్రస్తావించగా..”మా సినిమాను ‘అఖండ’తో కంపేర్ చేస్తున్నారా? అలా పోలిస్తే మంచిదే కదా! కానీ, మా సినిమాకు, ‘అఖండ’కు కథ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రెండూ వేర్వేరు సినిమాలు” అని గోపీచంద్ చెప్పారు.’భీమా’ ట్రైలర్ గమనిస్తే పరశు రాముని క్షేత్రంలో కొంత మంది రాక్షసులను అంతం చేయడానికి బ్రహ్మ రాక్షసుడు వచ్చాడని వాయిస్ ఓవర్ వస్తుంది. గోపీచంద్ పోలీస్ పాత్రలో నటించారు.దాంతో పాటు మరో గెటప్ లో కూడా కనిపించారు. పరశు రాముని క్షేత్రంలో అఘోరాలు ఉన్నారు. ఆ మహా శివుని ప్రస్తావన ఉందన్నట్టు చూపించారు. ‘అఖండ’లో హీరో బాలకృష్ణ అఘోర పాత్రలో నటించారు. ఈ మధ్య కాలంలో శివుని నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ‘అఖండ’ ది బెస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందువల్ల, ఆ సినిమాతో ‘భీమా’ను కంపేర్ చేశారు. బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తే మంచిదే అని గోపీచంద్ పేర్కొన్నారు.