Google warning: గూగుల్ యూజర్లకు వార్నింగ్.. అకౌంట్ డిలీట్ కావొద్దంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా వార్నింగ్ మేసేజ్ ను పంపిస్తుంది. గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కు ఇన్ యాక్టివ్ పరిమితిని రెండు సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అంటే, వినియోగదారులు 2 ఏళ్ల పాటు గూగుల్ అకౌంట్స్ ఉపయోగించకపోతే.. లేదంటే యాక్టివ్ గా లేకపోతే.. వాటిని పర్మినెంట్ గా డిలీట్ చేస్తామని హెచ్చరించింది. అయితే, నేరుగా గూగుల్ అకౌంట్ కి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసుల కోసం గూగుల్ అకౌంట్ ను ఉపయోగిస్తారో అలాంటి వాటిని తొలగించడం లేదని తెలిపింది.
Read Also: Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలేమో..!
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
గూగుల్ యూజర్లు గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసులను సైతం ఉపయోగించకుండా రెండు ఏళ్ల పాటు కొనసాగిస్తే.. అలాంటి అకౌంట్లను తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్ అకౌంట్ డిలీట్ చేయడానికి సుమారు 8 నెలల ముందు నుంచే వార్నింగ్ మెయిల్స్ పంపిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ హెచ్చరికల మెయిల్స్ ను కూడా పట్టించుకోకపోతే అప్పుడు సదరు అకౌంట్లను పర్మినెంట్ గా డిలీట్ చేస్తామని చెప్పింది. ఒకసారి గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తే, అదే పేరుతో మళ్లీ కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవడం అసాధ్యమని పేర్కొనింది. అందుకే గూగుల్ అకౌంట్స్ డిలీట్ కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు లాగిన్ కావాలని తెలిపింది.
Read Also: Fraud: ఇస్రో రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో మోసం.. ఇద్దరు అరెస్ట్
అయితే, రీసెంట్ గా గూగుల్ ఇండియాలో గూగుల్ వన్ సబ్ స్క్రైబర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ డేటాను సేఫ్ గా ఉంచుకోవచ్చు అని చెప్పుకొచ్చింది. బ్రౌజింగ్ డేటాను కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవచ్చని తెలిపింది. సదరు యూజర్ల వ్యక్తిగత వివరాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి చిక్కకుండా ఈ ఫీచర్ పని చేస్తుంది.
Read Also: Miss Shetty Mr Polishetty Trailer: పెళ్లి వద్దు.. ప్రెగ్నెంట్ కావాలి అంటున్న అనుష్క
గూగుల్ అకౌంట్ డిలీట్ కావొద్దంటే..?
సమయం దొరికిన్నప్పుడల్లా లాగిన్ కావాలి.
రెండు సంవత్సరాలకు ఒకసారైనా లాగిన్ కావాలి.
గూగుల్ డ్రైవ్ యూజ్ చేసిన ఫర్వాలేదు.
మెయిల్ పంపినా, చదివినా మీ అకౌంట్ డిలీట్ కాదు.
యూట్యూబ్‌లో వీడియోలు చూసినా ఓకే.
గూగుల్ యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసినా మీ అకౌంట్ సేఫ్.
ఇతర యాప్స్ ను గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసిన మీ అకౌంట్ తొలగించబడదు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి