Google Pixel 9 Price in India: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్’ 9 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. మంగళవారం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. ఏ ఫోన్స్ అన్ని టెన్సార్ జీ4 ఎస్‌ఓసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో వస్తున్నాయి. ఐపీ68 రేటింగ్ వాటర్, డస్ట్‌ను తట్టుకునే విధంగా వీటిని రూపొందించారు. ఆగస్టు 22 నుంచి పిక్సెల్ 9 సిరీస్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటేల్ ఔట్‌లెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
పిక్సెల్ 9 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియెంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. 128జీబీ స్టోరేజీ ఉన్నప్పటికీ భారత్‌లో అందుబాటులో లేదు. పీయోనీ, ఒబ్సిడియాన్, వింటర్‌గ్రీన్, పోర్సెలేన్ కలర్స్‌లో ఈ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. 6.3 అంగుళాలతో కూడిన ఈ ఫోన్లు ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 422 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, రిఫ్రెష్ రేట్ రేజింగ్ 69హెచ్‌జడ్ నుంచి 120 హెచ్‌జడ్ వరకు ఉంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్‌తో కూడిన స్క్రీన్ అమర్చారు. వెనక వైపున 50 మెగాపిక్సెల్ ఆక్టా పీడీవైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 64 మెగా పిక్సెల్ క్వాడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందువైపు 10.5 మెగాపిక్సెల్ ఉంది.
పిక్సెల్ 9లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 45 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఛార్జర్‌ను విడిగా కొనాల్సిందే. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సైతం ఇది సపోర్టు చేస్తుంది. 30 నిమిషాల్లోనే 55 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. సింగిల్ ఛార్జ్‌తో 24 గంటలు ఈ ఫోన్ పనిచేయనుంది. పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌లోనూ పిక్సెల్ 9లో ఉన్న సాఫ్ట్‌వేర్, చిప్‌సెట్ వంటి సేమ్ ఫీచర్లు ఉన్నా.. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీలలో వ్యత్యాసం ఉంది. 16జీబీ+256జీబీ పిక్సెల్ 9 ప్రో ధర రూ.1,09,999గా ఉండగా.. 16జీబీ+256జీబీ పిక్సెల్9 ప్రో ఎక్స్‌ఎల్ ధర రూ.1,24,999గా ఉంది. 16జీబీ+256జీబీ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ ధర రూ.1.72,999గా నిర్ణయించారు.