Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా? గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందే..! ఎందుకంటే.. జీపే భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందట.. ఏకంగా కొంత మందికి రూ.81 వేల వరకు క్యాష్ బ్యాక్ వచ్చేసింది.. కానీ, అది అనుకోకుండా జరిగిందట.. ఇదే విస్మయానికి గురిచేస్తోంది.. విషయం ఏంటంటే..? గూగుల్ పే అనుకోకుండా కొంతమంది వినియోగదారులకు రూ. 81 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది.. లోపం కారణంగా, కొంతమంది వినియోగదారుల గూగుల్ పే ఖాతాల్లో 1,000 అమెరికా డాలర్లు అంటే సుమారు రూ. 81,000 వరకు క్రెడిట్ చేసింది.. ఇదే విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది.
వినియోగదారులకు అదనపు డబ్బును క్రెడిట్ చేసే లోపం అనేకసార్లు జరుగుతూనే ఉంటుంది.. అటువంటి అరుదైన సంఘటనలో, అనేక మంది ఇంటర్నెట్ వినియోగదారులు తమ గూగుల్ పే ఖాతాలకు రెండు అదనపు డాలర్లు జమ చేసినట్లు నివేదించారు. ఈ లావాదేవీల మొత్తం 10 అమెరికా డాలర్ల నుండి 1,000 డాలర్ల వరకు వచ్చిందట.. ఇది లక్షరాల భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 81,000. అయితే, ఈ వినియోగదారుల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.. ఎందుకంటే కంపెనీ తన తప్పును వెంటనే గ్రహించి, అలా చేయడానికి అవకాశం ఉన్న సందర్భాలలో జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. అయితే, వినియోగదారులు ఇప్పటికే డబ్బును బదిలీ చేసిన లేదా ఖర్చు చేసిన సందర్భాల్లో, ఆ డబ్బును వినియోగదారులు ఉంచుకోవచ్చని, తదుపరి చర్య అవసరం లేదని గూగుల్ పే తెలిపింది.
చాలా మంది వినియోగదారులు తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక వినియోగదారు తన ఖాతాకు భారీగా 1072 డాలర్లు క్రెడిట్ అయ్యాయని చెబితే.. మరో వినియోగదారు తన ఖాతాలో 240 డాలర్లు ఎలా క్రెడిట్ అయ్యాయో పేర్కొన్నారు. అయితే, జీ పే ఇప్పుడు సాధ్యమైన చోట ఈ చెల్లింపులన్నింటినీ రివర్స్ తీసుకుంది.. మొత్తంగా వినియోగదారులకు మనీ క్రెడిట్ అవ్వడం సంచలనంగా మారింది. కొంతమంది జీపే వినియోగదారుల ఖాతాల్లో అనూహ్యంగా ఏకంగా రూ. 88,000 వరకు జమ అవ్వడం కలకలం సృష్టించింది.. అయితే, గూగుల్ పే యూజర్లకు స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మహా అయితే రూ. 6 క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ రావడమే ఈ మధ్య గొప్పగా మారింది.. సాధారణంగా బెటర్ లక్ నెక్ట్స్ టైం అనే సందేశం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా రూ.80 వేల వరకు ట్రాన్స్‌ఫర్ కావడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఇక, ఈ విషయంలో కొంత మంది యూజర్లను మెయిల్ ద్వారా సంప్రదించింది గూగుల్. వీలైనంత సొమ్మును వెనక్కి తీసుకుంది. అంతేకాదు సంబంధిత క్రెడిట్‌ను యూజర్లు వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసేసినా, తాము రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్ క్లారిటీ ఇచ్చింది.