Google Messages: సోషల్ మీడియా యాప్‌లో రోజుకో కొత్త ఫీచర్‌తో సత్తా చాటుతున్నాయి.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడిపోయింది.. ఇప్పటికే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్.. వంటి యాప్‌లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది.. దీంతో.. ఇకపై RCS చాట్ ద్వారా పంపే సందేశాలనూ ఎడిట్ చేసే అవకాశాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గుగుల్..
Read Also: Delhi: ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు.. సుప్రీంకోర్టు ఆవరణలో పక్షులకు ఆహారం, నీరు
గూగుల్ తన సందేశాల యాప్‌లో RCS చాట్‌ల కోసం సవరణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది 15 నిమిషాల విండోలో అక్షరదోషాలను (ఎడిట్) సరిచేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. RCS సాంప్రదాయ ఎస్ఎంఎస్/ఎంఎంఎస్ టెక్స్టింగ్‌ను మెరుగుపరుస్తుంది.. తెలియని వారికి, RCS అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మరియు ఇది సాంప్రదాయ SMS/MMS టెక్స్టింగ్‌కి అప్‌గ్రేడ్. WhatsApp లేదా iMessage వంటి యాప్‌లతో వినియోగదారులు ఇప్పటికే పొందుతున్న సేవలకు అనుగుణంగా మెసేజింగ్‌ను మరింత గొప్పగా చేసే అనేక ఫీచర్‌లను ఇది అందిస్తుంది. గూగుల్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ తో RCS ద్వారా పంపే ఏ మెసేజ్‌నైనా ఎడిట్ చేసుకోవచ్చు.. అయితే, అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే.. పాప్ అప్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను ఎంచుకుని సందేశంలోని తప్పులు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇలా సవరించిన మెసేజ్‌కు కింద చివరన ఎడిటెడ్ అని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, ఆ సందేశాన్ని పంపిన 15 నిమిషాల్లోనే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ కనిపించకుండా పోతుంది. ఈ ఎడిటింగ్ ఫీచర్ ప్రస్తుతం RCS చాట్‌లకు పరిమితం చేయబడిందని గమనించాలి.. ప్రామాణిక SMS/MMS సందేశాలకు ఇప్పటికీ ఎడిటింగ్ చేసుకునే అవకాశం లేదు..