టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళా.. ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జూలై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను తాజాగా మంజూరు చేస్తుండగా.. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మరో డీఏను త్వరలోనే ఇస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
Also Read : Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను ఆర్టీసీసంస్థ మంజూరు చేసిందని బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
Also Read : Adimulapu Suresh: ప్రజలు మోసం చేసేందుకే.. చంద్రబాబు కొత్త మేనిఫెస్టో
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
Also Read : Telangana: నిజామాబాద్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..
టీఎస్ఆర్టీసీ ఏడో విడత డీఏను మంజూరు చేస్తున్నట్లు చెప్పడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన డీఏను ఆర్టీసీ సంస్థ త్వరగా మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడిస్తున్నారు. తాము కూడా సంస్థ కోసం మరింత కష్టపడి పని చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు తెలుపుతున్నారు.