Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ పెంపుకు ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది. ఇప్పుడు కూడా డీఏను సవరించడంతో కొత్త స్థాయికి చేరుకుంది. దీంతో మళ్లీ హెచ్ఆర్ఏ కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay : హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదు
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
కొన్ని మీడియాలు తెలుపుతున్న ప్రకారం.. హెచ్ఆర్ఏ త్వరలోనే పెరగనున్నట్లు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనే చేసే ప్రదేశాన్ని బట్టి హెచ్ఆర్ ఇస్తారని తెలుపుతున్నారు. x, y, z కేటగిరీలుగా ఈ ప్రదేశాలను విభజించారు. x కేటగిరీ ప్రదేశాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 27 శాతం ఉంటుంది. అలాగే y గ్రూప్ ఉద్యోగులకు ఇది 18 నుంచి 20 శాతంగా ఉంటుంది. ఇక Z గ్రూప్ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం వరకు ఉంటుందని తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 3 శాతం వరకు పెరగవచ్చు అని తెలుస్తోంది. x గ్రూప్ ఉద్యోగులకు మూడు శాతం, y గ్రూప్ ఉద్యోగులకు రెండు శాతం, z గ్రూప్ ఉద్యోగులకు ఒక్క శాతం పెరిగే అవకాశముంది. ఈ పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది.
Read Also: Om Raut Responds: ఆదిపురుష్ ట్రోలింగ్స్ పై స్పందించిన ఓం రౌత్.. నేను చేసిన తప్పల్లా ఇదే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతూ.. ఈ ఏడాది మార్చి 24న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి దీన్ని వర్తింపజేసింది. దీంతో అప్పటి వరకు 38 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ కారణంగా కేంద్ర ఖజానాపై ఖజానాపై ఏటా రూ. 12,815.60 కోట్ల భారం పడనుంది. దీని ద్వారా దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 69.76 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములర్‌కు అనుగుణంగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచిన విషయం తెలిసిందే. ఒడిశా, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
- Tags
- employees
- Govt
- hra
- increase
- telugu news
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?