Gold Today Rate 23rd August 2023 in Hyderabad: ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కొన్ని రోజలుగా తగ్గుతూ లేదా స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,130గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 60 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,130గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
Also Read: Viral Video: బాబోయ్ ఆపండ్రా నాయనా.. ఇలాంటివి చూస్తే జన్మలో తినరు..
మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74, 800గా ఉండగా.. చెన్నైలో రూ. 78,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 78,000ల వద్ద కొనసాగుతోంది.