Gold Price Today in Hyderabad on on 24 June 2024: గత కొద్దిరోజులుగా పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం (జూన్ 24) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది. భారీగా తగ్గుదల లేకపోయినప్పటికీ.. కొనుగోలు చేసేందుకు బంగారం ప్రియులకు మాత్రం ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు.
సోమవారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,000గా.. 24 క్యారెట్ల ధర రూ.73,100గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది.
Also Read: Namrata Shirodkar: లండన్‌లో గౌతమ్ స్టేజ్ పెర్ఫామెన్స్.. ఆనందంలో నమ్రతా శిరోద్కర్!
నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ.300 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,700గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,700గా ఉండగా.. ముంబైలో రూ.91,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.96,200లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.91,150గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.96,200లుగా నమోదైంది.