Gold Price Today in Hyderabad on 18th October 2024: ‘దీపావళి’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ మధ్య తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు పరుగులు పెడుతోంది. వరుసగా మూడో రోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం (అక్టోబర్ 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ లాంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీపావళి, ధన్ తేరస్ ఉన్న నేపథ్యంలో పసిడి పరుగులు తీస్తుందే తప్ప.. తగ్గదని చెబుతున్నారు.
మరోవైపు వెండి కూడా పరుగులు పెడుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై నేడు రెండు వేలు పెరిగింది. శుక్రవారం కిలో వెండి రూ.99,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా ఉంది. బెంగళూరులో రూ.94,100గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,400
విజయవాడ – రూ.72,400
ఢిల్లీ – రూ.72,550
చెన్నై – రూ.72,400
బెంగళూరు – రూ.72,400
ముంబై – రూ.72,400
కోల్‌కతా – రూ.72,400
కేరళ – రూ.72,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,980
విజయవాడ – రూ.78,980
ఢిల్లీ – రూ.79,130
చెన్నై – రూ.78,980
బెంగళూరు – రూ.78,980
ముంబై – రూ.78,980
కోల్‌కతా – రూ.78,980
కేరళ – రూ.78,980
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,05,000
విజయవాడ – రూ.1,05,000
ఢిల్లీ – రూ.99,000
ముంబై – రూ.99,000
చెన్నై – రూ.1,05,000
కోల్‌కతా – రూ.99,000
బెంగళూరు – రూ.94,100
కేరళ – రూ.1,05,000