కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,400గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 91,400గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.91,550గా.. 24 క్యారెట్ల ధర రూ.99,860గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
Also Read: Jasprit Bumrah: నేనేమీ కుర్రాడిని కాదు.. బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా వారం పాటు స్థిరంగా ఉన్న వెండి.. రెండు రోజులుగా పెరుగుతోంది. నిన్న కిలో వెండిపై రూ.1,000 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.4,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి నేడు రూ.1,15,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,25,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,15,000గా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.