కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు…